<!-- Pramāṇa, a library of Indian primary sources · https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.4.2 -->

[Pramāṇa](https://indike.org/pramana/) › [Indian literature](https://indike.org/pramana/in) › [Epic, Poetry, Drama & Narrative](https://indike.org/pramana/in.lit) › [The Mahābhārata and its versions](https://indike.org/pramana/in.lit.mahabharata) › [Mahābhāratas in Indian regional languages](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa) › [Andhra Mahabharatamu](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra) › 1.4.2

# Andhra Mahabharatamu 1.4.2

Āndhra Mahābhāratamu 1.4.2

- **Language:** Telugu

### [1.4.2](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.4.2)

వ. అక్కథకుండు శౌనకాదిమహామునులకుం జెప్పె : నట్లు యయాతికిఁ బుత్త్రుం డయిన పూరుండు సకల మహీరాజ్యంబు సేయుచు వంశకర్త యయిన వానికిఁ గౌసల్య యనుదానికి జనమేజయుండు పుట్టి రాజై యశ్వమేధత్రయంబుఁజేసి ప్రఖ్యాతి నొందె; నాజనమేజయునకు ననంత యనుదానికిఁబ్రాచిన్వంతుఁడు పుట్టి పరాక్రమంబున నుదయాచల పర్యంతంబు ప్రాగ్దిగ్విజయంబు సేసి ప్రాచిన్వంతుఁడు నాఁ బరఁగె; నట్టి ప్రాచిన్వంతునకు నశ్మకి యనుదానికి సంయాతి పుట్టె; వానికి వరాంగియనుదానికి నహంయాతి పుట్టె; వానికిం గృతవీర్యపుత్త్రియైన భానుమతికి సార్వభౌముండు పుట్టె; వానికిఁ గేకయ రాజపుత్త్రి యైన సునందకు జయత్సేనుండు పుట్టె; వానికి వైదర్భి యైన సుశ్రవసకు నవాచీనుండు పుట్టె; నయ్యవాచీనునకు విదర్భరాజపుత్త్రి యైన మర్యాదకు నరిహుండు పుట్టె; వానికి నాంగి యనుదానికి మహాభౌముండు పుట్టె; నా మహాభౌమునకుం బ్రసేనజిత్పుత్త్రియైన సుపుష్టకు నయుతానీకుండు పుట్టె; వానికిం బృథుశ్రవసుని పుత్త్రి యైన కామకు నక్రోధనుండు పుట్టె; వానికిం గాళింగి యైన కరంభ యనుదానికి దేవాతిథి పుట్టె; వానికి వైదేహి యయిన మర్యాదకు ఋచీకుండు పుట్టె; వానికి నాంగియైన సుదేవ యనుదానికి ఋక్షుండు పుట్టె; ఋక్షునకుఁ దక్షకపుత్త్రి యయిన జ్వాలయనుదానికి మతినారుండు పుట్టి.

- [Previous: 1.4.1](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.4.1)
- [Next: 1.4.3](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.4.3)
- [Up: 1.4](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.4)

---
Source: [https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.4.2](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.4.2) · Pramāṇa
