<!-- Pramāṇa, a library of Indian primary sources · https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.8 -->

[Pramāṇa](https://indike.org/pramana/) › [Indian literature](https://indike.org/pramana/in) › [Epic, Poetry, Drama & Narrative](https://indike.org/pramana/in.lit) › [The Mahābhārata and its versions](https://indike.org/pramana/in.lit.mahabharata) › [Mahābhāratas in Indian regional languages](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa) › [Andhra Mahabharatamu](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra) › 2.1.8

# Andhra Mahabharatamu 2.1.8

Āndhra Mahābhāratamu 2.1.8

- **Language:** Telugu

### [2.1.8](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.8)

వ. తొల్లి వృషపర్వుండను దానవేంద్రున కొక్కసభ నిర్మింప సమకట్టి వివిధ రత్నమయంబులయిన యుపకరణంబు లొడఁగూర్చి బిందుసరంబను కొలన సంగ్రహించినవాఁడ; నయ్యుపకరణంబుల దాని విచిత్రంబుగా రచియించి తెచ్చి ధర్మరాజున కిచ్చెద; మఱియును భౌమాదిత్యుండను రాజర్షిచేత నిహితంబయి సకలశత్రుఘాతినియైన దాని భీమసేనున కొక్కగదను. దారుణంబయిన దివ్యఘోషంబు గలుగు దేవదత్తంబను శంఖం బర్జునునకు నిచ్చెద’నని చెప్పి ధర్మరాజుచేత సత్కృతుండై మయుం డరిగె; నంత నిట నారాయణుండును బాండవుల వీడ్కొని పితృదర్శనలాలసుండై ద్వారవతీపురంబున కరిగె; నట మయుండును బూర్వోత్తరదిశాభిముఖుండై పోయి కైలాసంబునుత్తరంబున మైనాకశైలంబునందు హిరణ్యశృంగంబున.

- [Previous: 2.1.7](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.7)
- [Next: 2.1.9](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.9)
- [Up: 2.1](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1)

---
Source: [https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.8](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.8) · Pramāṇa
