<!-- Pramāṇa, a library of Indian primary sources · https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.140 -->

[Pramāṇa](https://indike.org/pramana/) › [Indian literature](https://indike.org/pramana/in) › [Epic, Poetry, Drama & Narrative](https://indike.org/pramana/in.lit) › [The Mahābhārata and its versions](https://indike.org/pramana/in.lit.mahabharata) › [Mahābhāratas in Indian regional languages](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa) › [Andhra Mahabharatamu](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra) › 2.2.140

# Andhra Mahabharatamu 2.2.140

Āndhra Mahābhāratamu 2.2.140

- **Language:** Telugu

### [2.2.140](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.140)

వ. నిర్మల స్ఫటిక శిలానిర్మితం బై శశిప్రకాశంబై వివిధరత్న ప్రభా భాసురంబైన యా సభావిభవంబు చూచువేడుక నందుఁ గ్రుమ్మరు వాఁడ హరినీల బద్ధస్నిగ్ధ మణిస్థలంబునందు జలబుద్ధింజేసి పరిధానోత్కర్షణంబుసేసి, విమల శిలాతలబుద్ధి నుదకపరిపూర్ణం బయిన వాపి సొచ్చి, కట్టిన పుట్టంబు దడియం ద్రెళ్ళిన నన్నుం జూచి వృకోదరుండు నగియె; దాని నంతయు నెఱింగి ధర్మరాజ చోదితులయిన కింకరులు నాకుం బరిధానంబులు దెచ్చి యిచ్చిరి; మఱియు వివృతద్వారంబుఁ గవాట ఘటితం బని చొరనొల్లక, కవాటఘటితంబు వివృతంబుగా వగచి, చొరంబోయి తత్కవాట స్ఫటిక శిలా ఘట్టిత లలాటుండ నైన నన్నుం జూచి యనేక సహస్ర విలాసినీ పరివృతయయియున్న ద్రౌపది నగియె; నంత నకుల సహదేవులు పఱతెంచి ‘యిదె వాకిలి యిట వచ్చునది’ యని నన్నుం దోడ్కొని పోయి; రట్టి సభాప్రలంభంబు నాకు హృదయశల్యం బయి యున్నది.

- [Previous: 2.2.139](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.139)
- [Next: 2.2.141](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.141)
- [Up: 2.2](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2)

---
Source: [https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.140](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.140) · Pramāṇa
