<!-- Pramāṇa, a library of Indian primary sources · https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.212 -->

[Pramāṇa](https://indike.org/pramana/) › [Indian literature](https://indike.org/pramana/in) › [Epic, Poetry, Drama & Narrative](https://indike.org/pramana/in.lit) › [The Mahābhārata and its versions](https://indike.org/pramana/in.lit.mahabharata) › [Mahābhāratas in Indian regional languages](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa) › [Andhra Mahabharatamu](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra) › 2.2.212

# Andhra Mahabharatamu 2.2.212

Āndhra Mahābhāratamu 2.2.212

- **Language:** Telugu

### [2.2.212](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.212)

వ. వాఁడును ద్రౌపది పాలికింబోయి ‘దేవీ! నీ యడిగిన యర్థంబ నిర్ణయించువా రయి సభ్యులు నిన్ను రాఁబంచిరి; ర’మ్మనిన దుర్యోధను దుశ్చేష్టితంబునకు ధర్మరాజుసమ్మతంబునకు వెఱచి, యక్కోమలి ప్రాతికామిపిఱుంద నేకవస్త్రయు నధోనీవియు నవిరళగళితనయనోదకబిందుసందోహపరిపీడ్యమానపీనస్తన పరిధానాంతరయు నగుచు సభకుం జనుదెంచి కురువృద్ధుసమీపంబున నున్నంత; ద్రౌపదిం జూడ నోపక లజ్జితులయి దుఃఖాయమాన మానసులయి తలలు వాంచియున్న పాండవుల వైలక్ష్యం బుపలక్షించి సంతసిల్లి దుర్యోధనుండు దుశ్శాసనుం బిల్చి ‘ప్రాతికామి వృకోదరునకు వెఱచు; నీవు వోయి ద్రౌపదిం దోడ్కొని ర’మ్మని పంచిన.

- [Previous: 2.2.211](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.211)
- [Next: 2.2.213](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.213)
- [Up: 2.2](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2)

---
Source: [https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.212](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.212) · Pramāṇa
