<!-- Pramāṇa, a library of Indian primary sources · https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.227 -->

[Pramāṇa](https://indike.org/pramana/) › [Indian literature](https://indike.org/pramana/in) › [Epic, Poetry, Drama & Narrative](https://indike.org/pramana/in.lit) › [The Mahābhārata and its versions](https://indike.org/pramana/in.lit.mahabharata) › [Mahābhāratas in Indian regional languages](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa) › [Andhra Mahabharatamu](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra) › 2.2.227

# Andhra Mahabharatamu 2.2.227

Āndhra Mahābhāratamu 2.2.227

- **Language:** Telugu

### [2.2.227](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.227)

వ. ‘ఇక్కురువృద్ధు లైన భీష్మ ధృతరాష్ట్ర విదురాదులును నాచార్యులయిన ద్రోణకృపాదులుం బలుకరైరి; యున్న సభాసదులెల్లం గామక్రోధాదులు దక్కి విచారించి చెప్పుం’డనిన నెవ్వరుం బలుకకున్న ‘నే నిందు ధర్మ నిర్ణయంబు సేసెద; నెల్లవారును వినుండు; జూదంబును వేఁటయుఁ బానంబును బహుభక్షణాసక్తియు నను నాలుగు దుర్వ్యసనంబులం దగిలిన పురుషుండు ధర్మువుం దప్పివర్తిల్లు; నట్టి వాని కృత్యంబులు సేకొనం దగవు; కిత వాహూతుండై వ్యసనవర్తి యయి పరాజితుం డయిన పాండవాగ్రజుండు పాండవుల కందఱకు సాధారణ ధనంబయిన పాంచాలిఁ బణంబుఁ జేసెం గావున ద్రౌపది యధర్మవిజిత; యక్కోమలి నేకవస్త్ర నిట దోడ్కొని తెచ్చుట యన్యాయం’ బనిన వికర్ణుపలుకుల కొడంబడక కర్ణుండు వాని కి ట్లనియె.

- [Previous: 2.2.226](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.226)
- [Next: 2.2.228](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.228)
- [Up: 2.2](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2)

---
Source: [https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.227](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.227) · Pramāṇa
