<!-- Pramāṇa, a library of Indian primary sources · https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.229 -->

[Pramāṇa](https://indike.org/pramana/) › [Indian literature](https://indike.org/pramana/in) › [Epic, Poetry, Drama & Narrative](https://indike.org/pramana/in.lit) › [The Mahābhārata and its versions](https://indike.org/pramana/in.lit.mahabharata) › [Mahābhāratas in Indian regional languages](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa) › [Andhra Mahabharatamu](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra) › 2.2.229

# Andhra Mahabharatamu 2.2.229

Āndhra Mahābhāratamu 2.2.229

- **Language:** Telugu

### [2.2.229](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.229)

వ. నీవు ద్రౌపది నధర్మవిజిత యని పలికితి; సభాసదులెల్ల నెఱుంగ ధర్మజుండు దన సర్వస్వమ్ము నొడ్డి యోటువడి నప్పు డిది వానికి వెలిగాదు గావున ధర్మవిజితయ; యిట్లు గానినాఁడు పాండవు లిందఱును దీని విజితఁగా నేల యొడంబడుదురు? మఱి యేకవస్త్రయై యున్న దీని సభకుం దోడ్కొని వచ్చుట ధర్మువు గాదంటి; భార్యకు దైవవిహితుం డయిన భర్త యొక్కరుండ; యిది యనేకభర్తృక గావున బంధకి యనంబడు; నిట్టిదాని విగతవస్త్రం జేసి తెచ్చినను ధర్మవిరోధంబు లే’ దని కర్ణుండు వికర్ణువచనంబులకుం బ్రత్యాఖ్యానంబు సేసిన విని, దుర్యోధనుండు దుశ్శాసనుం బిలిచి ‘యిప్పాండవులయు ద్రౌపదియు వస్త్రంబు లపహరింపు’ మని పంచిన దాని నెఱింగి.

- [Previous: 2.2.228](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.228)
- [Next: 2.2.230](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.230)
- [Up: 2.2](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2)

---
Source: [https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.229](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.229) · Pramāṇa
