<!-- Pramāṇa, a library of Indian primary sources · https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.243 -->

[Pramāṇa](https://indike.org/pramana/) › [Indian literature](https://indike.org/pramana/in) › [Epic, Poetry, Drama & Narrative](https://indike.org/pramana/in.lit) › [The Mahābhārata and its versions](https://indike.org/pramana/in.lit.mahabharata) › [Mahābhāratas in Indian regional languages](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa) › [Andhra Mahabharatamu](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra) › 2.2.243

# Andhra Mahabharatamu 2.2.243

Āndhra Mahābhāratamu 2.2.243

- **Language:** Telugu

### [2.2.243](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.243)

వ. ‘ధర్మం బధర్మవిద్ధంబయి సభకు వచ్చిన దానిం దీర్పనిసభ్యు లధర్మవిద్ధు లగుదురు; మఱి సభ్యులు కామక్రోధంబులు విడిచి యధర్మంబు నాపనినాఁ డయ్యధర్మంబునం దొక్కపాదంబు సభ్యుల, నొక్కపాదంబు భూపతిఁ, దక్కినయది గర్తనుం బొందు; సమంజసులైన సభ్యులచేత విధ్యుక్తం బయ్యెనేని నధర్మంబు కర్తనుం బొందుఁ; గావున ధర్మంబు దప్పక చెప్పవలయు’ననినం బ్రహ్లాదుండు ధర్మమతియై విచారించి తనకొడుకుకంటె గుణశ్రేష్ఠుఁడుగా సుధన్వుం జెప్పినఁ, ‘బుత్త్రస్నేహంబు విడిచి ధర్మువు దప్పక చెప్పి’ తని ప్రహ్లాదుం బ్రశంసించి సుధన్వుం డరిగెఁ; గావున ‘మీరును ద్రౌపదీ ప్రశ్నంబునందు ధర్మబుద్ధిసేయుం’ డని విదురుండు పలికిన, దుర్యోధను భయంబున సభ్యు లెవ్వరుం బలుకరయిరి; ద్రౌపదియు నట్లు సకలక్షత్త్రియసమక్షంబున దుశ్శాసనుచేతం బరిభవింపంబడి దుఃఖిత యయి.

- [Previous: 2.2.242](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.242)
- [Next: 2.2.244](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.244)
- [Up: 2.2](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2)

---
Source: [https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.243](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.243) · Pramāṇa
