<!-- Pramāṇa, a library of Indian primary sources · https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.86 -->

[Pramāṇa](https://indike.org/pramana/) › [Indian literature](https://indike.org/pramana/in) › [Epic, Poetry, Drama & Narrative](https://indike.org/pramana/in.lit) › [The Mahābhārata and its versions](https://indike.org/pramana/in.lit.mahabharata) › [Mahābhāratas in Indian regional languages](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa) › [Andhra Mahabharatamu](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra) › 2.2.86

# Andhra Mahabharatamu 2.2.86

Āndhra Mahābhāratamu 2.2.86

- **Language:** Telugu

### [2.2.86](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.86)

వ. అట దుర్యోధనుండు శకునియుం దానును సభావిభవంబుఁ జూచు వేడుక నందుఁ గొన్ని దినంబు లుండి, యొక్కనాఁడు దాని యపూర్వరమణీయతకు విస్మితుం డగుచు నయ్యయి ప్రదేశంబులం గ్రుమ్మరువాఁడు వివృతంబైన ద్వారదేశంబు సంవృతంబుగా వగచి చొరనొల్లక, సంవృతంబైనదాని వివృతంబుగా వగచి చొరంబోయిలలాట ఘట్టితగృహద్వారుండయి, సమప్రదేశం బున్నతంబుగా వగచి యెక్కసమకట్టి, నీలాశ్మరశ్మి స్థగితంబైన విమలమణిస్థలంబు జలాశయంబుగా వగచి పరిధానం బెగఁద్రోచికొని, స్ఫటికదీప్తిజాల పరివృతంబైన జలాశయంబు స్థలంబుగా వగచి కట్టిన పుట్టంబు దడియంజొచ్చి, క్రమ్మఱిన వానిం జూచి పాంచాలియుఁ బాండుకుమారులును నగి రంత.

- [Previous: 2.2.67](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.67)
- [Next: 2.2.87](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.87)
- [Up: 2.2](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2)

---
Source: [https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.86](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.86) · Pramāṇa
