<!-- Pramāṇa, a library of Indian primary sources · https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.2.221 -->

[Pramāṇa](https://indike.org/pramana/) › [Indian literature](https://indike.org/pramana/in) › [Epic, Poetry, Drama & Narrative](https://indike.org/pramana/in.lit) › [The Mahābhārata and its versions](https://indike.org/pramana/in.lit.mahabharata) › [Mahābhāratas in Indian regional languages](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa) › [Andhra Mahabharatamu](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra) › 3.2.221

# Andhra Mahabharatamu 3.2.221

Āndhra Mahābhāratamu 3.2.221

- **Language:** Telugu

### [3.2.221](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.2.221)

వ. ఇట్లు సంగతులైన యయ్యిరువురకు విరహ పరితాపంబు తోడన శరీరమలినత్వంబు వాసెఁ, బర స్పరానురాగంబు తోడన విభూషణశ్రీవిశేష విలేపన యోగంబులు విస్తరిల్లె; నంత నంతయు విని భీముండు జాతసస్య యైన వసుధ తోయసంప్రాప్తి నాప్యాయిత యైన ట్లజ్ఞాతచర్యుం డైన తన పతిం బడసి పరమసంతుష్టహృదయయై చంద్రుతోఁగూడిన రోహిణియుంబోలెఁబతిం గూడి యొప్పుచున్న దమయంతిం జూచి సంతసిల్లి, తన పురంబునం దష్టశోభనంబులు దేవగృహంబులయందు విశేషపూజలు సేయించె; నట్టి మహోత్సవం బెఱింగి ఋతుపర్ణుండు నలునొద్దకు వచ్చి ‘నీవు నిఖిలలోక పూజ్యుండ వయ్యును నాయొద్ద బాహుకుం డనంగాఁ బ్రచ్ఛన్న వృత్తి నున్న నిన్ను నెఱుంగక నీచకర్మంబులయందు నియోగించితి; దీని క్షమియించునది’ యని నలుచేత సత్కృతుండై యశ్వహృదయోపదేశంబు గొని యయోధ్యకుం జనియె; నిట నలుండును విదర్భాపురంబున నొక్కమాసంబు నివాసంబు సేసి, విదర్భేశ్వరు వీడ్కొని దమయంతి నంద పెట్టి, యొక్క రథంబును బదియా ఱేనుంగులును, నేఁబది గుఱ్ఱంబులు, నాఱునూఱు కాల్బలంబులుఁ దనకుఁ దోడుగా నిషధపురంబున కరిగి, పుష్కరుం గని యిట్లనియె.

- [Previous: 3.2.220](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.2.220)
- [Next: 3.2.222](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.2.222)
- [Up: 3.2](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.2)

---
Source: [https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.2.221](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.2.221) · Pramāṇa
