<!-- Pramāṇa, a library of Indian primary sources · https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.2.253 -->

[Pramāṇa](https://indike.org/pramana/) › [Indian literature](https://indike.org/pramana/in) › [Epic, Poetry, Drama & Narrative](https://indike.org/pramana/in.lit) › [The Mahābhārata and its versions](https://indike.org/pramana/in.lit.mahabharata) › [Mahābhāratas in Indian regional languages](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa) › [Andhra Mahabharatamu](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra) › 3.2.253

# Andhra Mahabharatamu 3.2.253

Āndhra Mahābhāratamu 3.2.253

- **Language:** Telugu

### [3.2.253](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.2.253)

వ. అందుఁ బరమేశ్వరుం బూజించి పాపవిముక్తు లగుదురు; సాగర సింధు సంగమ స్నాతులైనవారు వరుణలోక గతు లగుదురు; శంకుకర్ణేశ్వరంబున నీశ్వరుం బూజించి దశాశ్వమేధ ఫలప్రాప్తు లగుదురు; వసుధారయును వసుసరంబు నను తీర్థంబు లాడి వసుప్రాప్తు లగుదురు; సింధూత్తమస్నానంబున బహుసువర్ణదానఫలం బగు; బ్రహ్మతుంగసేవనంబున బ్రహ్మలోకప్రాప్తి యగు; శక్రకుమారీ విలోకనంబున శక్రలోకగతి యగు; శ్రీ కుండంబునఁ బితామహునకు నమస్కరించియు, సౌవర్ణరాజితంబులైన మత్స్యంబులు గల విమలం బను తీర్థంబాడియు వాసవసాయుజ్యంబు వడయుదురు; బడబ యను తీర్థంబున నగ్నిదేవునకు నైవేద్యం బిచ్చిన నది యక్షయంబై పితృదేవతలకుఁ దృప్తిఁ జేయు, గోసహస్ర దానంబునకు నశ్వమేధ సహస్రంబునకు విశేషంబు.

- [Previous: 3.2.252](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.2.252)
- [Next: 3.2.254](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.2.254)
- [Up: 3.2](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.2)

---
Source: [https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.2.253](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.2.253) · Pramāṇa
