<!-- Pramāṇa, a library of Indian primary sources · https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.2.260 -->

[Pramāṇa](https://indike.org/pramana/) › [Indian literature](https://indike.org/pramana/in) › [Epic, Poetry, Drama & Narrative](https://indike.org/pramana/in.lit) › [The Mahābhārata and its versions](https://indike.org/pramana/in.lit.mahabharata) › [Mahābhāratas in Indian regional languages](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa) › [Andhra Mahabharatamu](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra) › 3.2.260

# Andhra Mahabharatamu 3.2.260

Āndhra Mahābhāratamu 3.2.260

- **Language:** Telugu

### [3.2.260](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.2.260)

వ. అక్కురుక్షేత్రశమంత పంచకంబుల నడుమ రామహ్రదంబు నడుమఁ బితామహు నుత్తరవేది యనంబడునట్టి కురుక్షేత్రంబు ముట్టిన వారికిఁ, గురుక్షేత్రంబునకుం బోయెద మనిన వారికిఁ, గురుక్షేత్రంబున వసియించెదమని తలంచినవారికి సర్వపాపక్షయం బగుఁ; దదనంతరంబున విష్ణుస్థానంబున విష్ణువు నర్చించిన నశ్వమేధ ఫలం బగుఁ; బారిప్లవం బను తీర్థమాడి యగ్నిష్టోమఫలంబు వడయుదురు; పృథివీతీర్థం బాడిన గోసహస్ర దానఫలం బగు; శాలూకిని యను తీర్థం బాడిన దశాశ్వమేధ ఫలం బగు; సర్పతీర్థం బాడి యందుఁ దరండకుం డను ద్వారపాలకునిం జూచినవారి కిష్టసిద్ధి యగు; నెందేని విష్ణుం డాదివరాహం బయ్యె నట్టి వరాహతీర్థం బాడినవారికి నగ్నిష్టోమ ఫలంబగు; నశ్వినీతీర్థం బాడిన రూపవంతు లగుదురు; జయంతి యందు సోమతీర్థ స్నానంబును, గృతశౌచతీర్థస్నానంబును రాజసూయ పౌండరీక సమంబు; లగ్నివటంబున, ముంజవటంబున నీశ్వరుం బూజించి గాణపత్యంబు వడయుదురు; యక్షిణీతీర్థమాడి యిష్టఫలంబులు వడయుదురు; కురుక్షేత్ర ద్వారంబుఁ బ్రదక్షిణంబు సేసినం బాపక్షయం బగు.

- [Previous: 3.2.259](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.2.259)
- [Next: 3.2.261](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.2.261)
- [Up: 3.2](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.2)

---
Source: [https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.2.260](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.2.260) · Pramāṇa
