<!-- Pramāṇa, a library of Indian primary sources · https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.2.274 -->

[Pramāṇa](https://indike.org/pramana/) › [Indian literature](https://indike.org/pramana/in) › [Epic, Poetry, Drama & Narrative](https://indike.org/pramana/in.lit) › [The Mahābhārata and its versions](https://indike.org/pramana/in.lit.mahabharata) › [Mahābhāratas in Indian regional languages](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa) › [Andhra Mahabharatamu](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra) › 3.2.274

# Andhra Mahabharatamu 3.2.274

Āndhra Mahābhāratamu 3.2.274

- **Language:** Telugu

### [3.2.274](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.2.274)

వ. మఱియు గంగోద్భేద తీర్థంబు నిందీవర తీర్థంబు గంగాద్వారంబు దిశాపతి తీర్థంబు లనియెడు తీర్థంబుల నాడి వాజపేయఫలంబుఁ బడయుదురు; బాహుద యను తీర్థం బాడిన ననేకసత్రయాగఫలం బగు; నెందేని రాముండు స్వర్గగతుం డయ్యె నట్టి సరయూప్రదేశంబున గోప్రదానం బాడియు, దేవతలకు ఋషులకు యజ్ఞ భూమియయిన తీరంబులు గల గోమతి నాడియు నశ్వమేధ ఫలంబు వడయుదురు; కోటితీర్థంబునం గుమారు నర్చించియు, వారణాసియందు రుద్రు నర్చించియుఁ, గపిలాహ్రదం బాడియు రాజసూయ ఫలప్రాప్తు లగుదురు; మార్కండేయ తీర్థం బయిన గంగాగోమతీ సంగమం బాడియు బ్రహ్మకల్పితం బయిన యూపంబుఁ బ్రదక్షిణంబు సేసియు వాజపేయఫలంబు వడయుదురు.

- [Previous: 3.2.273](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.2.273)
- [Next: 3.2.275](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.2.275)
- [Up: 3.2](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.2)

---
Source: [https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.2.274](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.2.274) · Pramāṇa
