<!-- Pramāṇa, a library of Indian primary sources · https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.2.59 -->

[Pramāṇa](https://indike.org/pramana/) › [Indian literature](https://indike.org/pramana/in) › [Epic, Poetry, Drama & Narrative](https://indike.org/pramana/in.lit) › [The Mahābhārata and its versions](https://indike.org/pramana/in.lit.mahabharata) › [Mahābhāratas in Indian regional languages](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa) › [Andhra Mahabharatamu](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra) › 3.2.59

# Andhra Mahabharatamu 3.2.59

Āndhra Mahābhāratamu 3.2.59

- **Language:** Telugu

### [3.2.59](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.2.59)

వ. అనిన నందఱు నగి‘నీ వందుల కేల పోయె? దది ముందర నిర్వృత్తంబయ్యె; నక్కోమలి యొరుల నెవ్వరి మెచ్చక నలుం డను వాని వరియించె’ ననినం గలి కరం బలిగి, ‘యన్నలునకు దమయంతికి రాజ్య విభవ పరిత్యాగంబును బరస్పర వియోగంబునుం జేసెద’ నని నిశ్చయించి, వాని నక్షరతుంగా నెఱింగి, యక్షంబులం జొచ్చి యుండ ద్వాపరుం బనిచి, నలు సేయుచున్న యశ్వమేధాది కానేక భూరి దక్షిణ మహాక్రతువులయు జపహోమ దానాది వివిధ పుణ్యకర్మంబులయుఁ గారణంబునం జొర నవసరంబుఁ గానక, యంతరం బన్వేషించుచుఁ బెద్దకాలం బుండి, యొక్కనాఁ డతండు కృతమూత్రుండయి జలోపస్పర్శనానంతరంబునం బాదశౌచంబు సేయమఱచి సంధ్యోపాసనంబు సేసిన, నుపలబ్ధావసరుం డయి కలి నలునందుఁ బ్రవేశించి, పుష్కరుం డను వాని పాలికిం బోయి త న్నెఱింగించి ‘నీవు నలునితో జూదంబాడి వాని రాజ్యంబును సర్వస్వంబును నొడిచికొ’ మ్మని చెప్పి తానును వానికి విప్రవేషంబున సహాయుండై యక్షంబులు గొని పుష్కరునితో నొక్కటం జని నలుం గాంచి ‘నీవు మాతో జూదం బాడు’ మనిన.

- [Previous: 3.2.58](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.2.58)
- [Next: 3.2.60](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.2.60)
- [Up: 3.2](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.2)

---
Source: [https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.2.59](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.2.59) · Pramāṇa
