Pramāṇa · Search · About · API

Rayavacakamu 4.25

Rāyavācakamu 4.25

Language
Telugu

4.25

తెలిశినది యెట్టు అని జ్ఞానదృష్టినిజూచి విద్యారణ్యులతోను మీరు
శింగిరిభట్లు దెలుపగా గదా మాస్వరూపం యెరిగితిరి
మంచిదాయెను శింగిరిభట్లు బహుకాలముగా మాకు స్నేహమైవుండును
ఆయనకునిద్రాఆహారములు లేక అశ్వద్ధవన మందు చాలా అవధిపడుతావు
న్నాడు నిన్నుంచి కర్నాట కాన వఖ నగరం కానున్నది అందు ము
న్నూట అరవై యేండ్లు లక్ష్మీకటాక్షం కలిగివుండును ఆపట్ణం వున్న నాళ్ల
కు ఆ సింహ్మాసనస్థునితోదెలిపి శింగిరిభట్లకు ప్రీతిగా నిత్య కృత్యమున్ను
పంచభక్ష్యపరమాన్నముతోడట్టు మృష్టాన్నముగా సహస్రబ్రాహ్మణభో