Andhra Mahabharatamu 1.2.206
Āndhra Mahābhāratamu 1.2.206
- Language
- Telugu
1.2.206
వ. ఇట్లు కృతనిశ్చయుం డై జనమేజయుండు కాశిరాజపుత్త్రి యయిన వపుష్టమ యను మహాదేవి ధర్మపత్నిగా సర్పయాగదీక్షితుం డయి, శాస్త్రోపదిష్ట ప్రమాణ లక్షణ నిపుణ శిల్పాచార్య వినిర్మితంబును, యజ్ఞోపకరణానేక ద్రవ్యసంభారసంభృతంబును, బ్రభూతధనధాన్యసంపూర్ణంబును, స్వస్వనియుక్తక్రియారంభసంభ్రమ పరిభ్రమద్బ్రాహ్మణ నివహంబును నయిన యజ్ఞాయతనంబున నున్న యా రాజునకు నొక్క వాస్తువిద్యా నిపుణుం డైన పౌరాణికుం డి ట్లనియె.