Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.2.208

Āndhra Mahābhāratamu 1.2.208

Language
Telugu

1.2.208

వ. అనినవానివచనం బవకర్ణించి, రాజనియుక్తు లయి చ్యవనకుల విఖ్యాతుండైన చండభార్గవుండు హోతగాఁ, బింగళుం డధ్వర్యుండుగా, శార్ఙ్గరవుండు బ్రహ్మగాఁ, గౌత్సుం డుద్గాతగా, వ్యాస వైశంపాయన పైల జైమిని సుమంతు శుక శ్వేతకేతు మౌద్గ ల్యోద్దాలక మాండవ్య కౌశిక కౌండిన్య శాండిల్యక్రామఠకకోహ లాసిత దేవల నారద పర్వత మైత్రే యాత్రేయ కుండజఠర కాలఘట వాత్స్యశ్రుతశ్రవో దేవశర్మ శర్మద రోమ శోదంక హరిత రురు పులోమ సోమశ్రవసు లాదిగాఁ గల మహామునులు సదస్యులుగా నీలాంబరపరిధానులును, ధూమసంరక్తనయనులు నై యాజ్ఞికు లగ్నిముఖంబు సేసి వేల్వం దొడంగిన.