Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.2.210

Āndhra Mahābhāratamu 1.2.210

Language
Telugu

1.2.210

వ. మఱియుఁ గోటిశ మానసపూర్ణ శలపాల హలీమక పిచ్ఛిల గౌణప చక్ర కాలవేగ ప్రకాలన హిరణ్యబాహు శరణ కక్షక కాలదంతకాదు లయిన వాసుకి కుల సంభవులును, బుచ్ఛాండక మండలక పిండసేక్తృ, రణేభకోచ్ఛిఖ శరభ భంగ బిల్వ తేజోవిరోహణ శిలి శలకర మూక సుకుమార ప్రవేపన ముద్గర శిశురోమ సురోమ మహాహన్వాదు లయిన తక్షక కుల సంభవులును, బారావత పారిజాత యాత్ర పాండర హరిణ కృశ విహంగ శరభ మోద ప్రమోద సంహతాపనాదు లయిన యైరావతకులసంభవులును, నేరక కుండల వేణి వేణీస్కంధ కుమారక బాహుక శృంగబేర ధూర్తక ప్రాతరాతకాదు లయిన కౌరవ్యకులసంభవులును, శంకుకర్ణ పిఠరక కుఠార సుఖసేచక పూర్ణాంగద పూర్ణముఖప్రహాస శకుని దర్యమాహఠ కామఠక సుషేణ మానసావ్యయ భైరవ ముండ వేదాంగ పిశంగ చోద్రపారక వృషభ వేగవ త్పిండారక మహాహను రక్తాంగ సర్వసారంగ సమృద్ధ పఠవాసక వరాహకవీరణకసుచిత్ర చిత్రవేగిక పరాశర తరుణకమణిస్కంధారుణ్యాదు లయిన ధృతరాష్ట్రకుల సంభవులును నయి యొక్కొక్కమొగి సహస్రాయుతసంఖ్యలు గలిగి.