Andhra Mahabharatamu 1.2.215
Āndhra Mahābhāratamu 1.2.215
- Language
- Telugu
1.2.215
వ. పురందరుండును దొల్లి కమలజువాక్యంబున వాసుకిప్రముఖ సర్పకులముఖ్యులకు సర్పసత్త్రభయంబు లేమి యెఱింగినవాఁడు గావున వాని నోడకుండు మని చేకొనియుండె; నిట వాసుకియు జనమేజయ సమారబ్ధ సర్పసత్త్ర పరిత్రస్తుం డై ద్వియోజన త్రియోజనాయామ స్థూలవ్యాళనివహంబులు నిజవంశ భ్రాతృవంశ జనితంబు లయినవి జననీ వాగ్దండపీడితంబు లయి యగ్నికుండంబునఁ బడుటకు శోకించి తన చెలియలి జరత్కారువుం జూచి యి ట్లనియె.