Andhra Mahabharatamu 1.2.218
Āndhra Mahābhāratamu 1.2.218
- Language
- Telugu
1.2.218
వ. ‘బ్రహ్మవచనంబు నిట్టిద కా విని యేలాపుత్త్రుండు మాకుఁ జెప్పె; జరత్కారుమహామునికి నిన్ను వివాహంబు సేయుటయు నేతదర్థంబ; యింకొక్కనిమేషంబేని యుపేక్షించిన సకలసర్పప్రళయం బగుం గావున నాస్తీకుండు జనమేజయ మహీపాలు పాలికిం బోయి సర్పయాగం బుడిగించి రక్షింపవలయు’ ననిన, నయ్యగ్రజువచనంబులు విని జరత్కారువు గొడుకు మొగంబు చూచి ‘భవన్మాతుల నియోగంబు సేయు’ మనిన నాస్తీకుం డి ట్లనియె.