Andhra Mahabharatamu 1.7.210
Āndhra Mahābhāratamu 1.7.210
- Language
- Telugu
1.7.210
వ. అట్టి యవసరంబునఁ దల్లియొద్దకు ధర్మరాజును గవలవారు మున్న వచ్చియున్నఁ, దదనంతరంబ భీమార్జునులు ద్రౌపదీసహితు లయి చనుదెంచి మ్రొక్కి ‘మే మొక్క భిక్ష దెచ్చితి’ మని తల్లికి నివేదించిన, నెఱుంగక యెప్పటి యట్ల కా వగచి కుంతీదేవి సంతసిల్లి దాని ‘మీ రేవురు నుపయోగింపుఁ’ డని కొడుకుల నియోగించి, భువన త్రయ రాజ్య లక్ష్మియుం బోలె నున్న యక్కన్నియం జూచి లజ్జించి, యధర్మభీత యయి ధర్మతనయున కి ట్లనియె.