Andhra Mahabharatamu 1.7.222
Āndhra Mahābhāratamu 1.7.222
- Language
- Telugu
1.7.222
వ. ‘సకలరాజసమక్షంబున నిట్టి యతిమానుషం బయిన యద్భుతకర్మం బర్జునునక కా కన్యులకుఁ జేయ శక్యంబె? యని యెఱింగితిమి; మీపరాక్రమంబ మిమ్ము నెఱింగించె; నధర్మనిరతు లగు ధృతరాష్ట్రదుర్యోధనులు సేసిన లాక్షాగారదాహప్రయోగంబువలన విముక్తుల రయితి; రింక మీకు ల గ్గుగు’ నని చెప్పి బలదేవసహితుం డయి వాసుదేవుం డరిగిన; నిట ద్రుపదుండు దనకూఁతునకు వరుం డైన వాఁ డెవ్వఁడో యేవంశంబునవాఁడో వాని చరితం బెట్టిదో యెఱింగి రమ్మని ధృష్టద్యుమ్నుం బనిచిన, నతండు భీమార్జున ద్రౌపదుల పిఱుందన వచ్చి త న్నొఱు లెఱుంగకుండ నక్కుంభకారగృహంబున నుండి యంత వృత్తాంతంబు నెఱింగిపోయి ద్రుపదున కి ట్లనియె.