Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.7.225

Āndhra Mahābhāratamu 1.7.225

Language
Telugu

1.7.225

వ. ‘మఱియు రెండగుపా లన్నలువురకుం బెట్టి తద్భుక్తశేషం బేనును నీవు నుపయోగింత’ మని పంచినఁ; గృష్ణయు నయ్యవ్వ పంచినరూపున నందఱకుం గుడువం బెట్టి, తానును గుడిచి, దర్భపూరులు విద్రిచి యందఱకు వేఱువేఱ శయనమ్ము లిమ్ముగా రచియించి, వానిపయి వారల కృష్ణాజినంబులు పఱచి సుఖశయను లై యున్న వారి పాదంబులకు నుపధానభూత యై శయనించి.