Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.7.235

Āndhra Mahābhāratamu 1.7.235

Language
Telugu

1.7.235

వ. ‘ మీ రాజు మనోరథంబు సఫలం బయ్యె వగవ నేల?’ యనిన ధర్మరాజుపలుకు విని పురోహితుండు వోయి ద్రుపదున కెఱింగించిన; ద్రుపదుండు ధృష్టద్యుమ్నుం జూచి ‘చాతుర్వర్ణ్యోచితంబు లయిన రథంబులు గొనిపోయి వారల దోడ్కొని ర’ మ్మని పంచిన వాఁడును నాక్షణంబ పాండవుల పాలికి వచ్చి ‘యీరథంబు లెక్కి మారాజునొద్దకు రం’ డనినఁ బాండవులు రాజయోగ్యంబు లయి రత్నాంచితంబు లయిన కాంచన రథంబు లెక్కి కుంతీదేవిని, ద్రౌపదిని నొక్కరథం బెక్కించి తోడ్కొని ధృష్టద్యుమ్నుతో ద్రుపదరాజనివేశంబున కరుగుదెంచునంత ద్రుపదుండును వారల కనేకవిధంబు లైన వస్తువు లతిప్రీతిం బుత్తెంచినఁ, బరార్థ్యంబు లైన యొండువస్తువులఁ బరిగ్రహింపక సాంగ్రామికంబు లైన యసిచర్మకార్ముకబాణతూణీరరథవరూథ వాజివారణ నివహంబులఁ బరిగ్రహించి తనయొద్దకు వచ్చువారి.