Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.7.237

Āndhra Mahābhāratamu 1.7.237

Language
Telugu

1.7.237

వ. ‘మఱియుం దనయొద్దకు వచ్చి యశంకితు లయి క్షత్త్రియోచితంబు లైన మహార్హాసనంబుల నున్నవారల రాజపుత్త్రులంగా నెఱింగియు, సంశయాపనోదనపరుండై ధర్మతనయునకు ద్రుపదుం డి ట్లనియె ‘నయ్యా! మీరు క్షత్రియులరో బ్రాహ్మణులరో మాయావు లయి క్రుమ్మరుచున్న మంత్రసిద్ధులరో కాక కృష్ణాపరిగ్రహణార్థంబు దివంబున నుండి వచ్చిన దివ్యులరో యెఱుంగము; మాకు సందేహం బయి యున్నయది; మీ కలరూ పెఱింగి కాని యిక్కన్య వివాహంబు సేయనేర’ మనిన ద్రుపదునకు ధర్మతనయుం డి ట్లనియె.