Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.7.239

Āndhra Mahābhāratamu 1.7.239

Language
Telugu

1.7.239

వ. ‘వీరు కుంతీమహాదేవు’ లని తన్నునుం దమ్ములనుం దల్లిని నెఱింగించిన, ద్రుపదుం డతిహర్షరసావేశపరవశుం డయి పెద్దయుం బ్రొద్దునకుఁ దెలిసి, యానందజలభరితనయనుం డగుచు ‘నా పుణ్యంబున లాక్షాగృహదాహం బువలన విముక్తుల రయితి’ రని సంతసిల్లి తద్వృత్తాంతం బంతయు ధర్మతనయునివలన విని, ధృతరాష్ట్ర దుర్యోధనుల నిందించి, సామప్రియభాషణంబుల నభీష్టసత్కారంబులను వారిం బూజించి, యొక్కనాఁడు పుత్త్రమిత్రామాత్య బాంధవబ్రాహ్మణపరివృతుం డయి ద్రుపదుండు సుఖాసీను లయి యున్న పాండవుల కి ట్లనియె.