Andhra Mahabharatamu 1.7.247
Āndhra Mahābhāratamu 1.7.247
- Language
- Telugu
1.7.247
వ. ఇట్లు వచ్చిన కృష్ణద్వైపాయనునకుఁ గుంతీదేవియుఁ బాండవులును బాంచాలుండు నతిభక్తి మ్రొక్కి యమ్మహామునిం గాంచనమణిమయోచ్చాసనంబున నునిచి యర్ఘ్యపాద్యాదివిధులం బూజించి యున్న వారల కుశలం బడిగి హిత మధురసత్యసంభాషణామృతరసప్రవాహసందోహంబున నందఱం బరమానందహృదయులం జేసియున్న యమ్మునీంద్రునకు ముకుళితకరకమలుండయి ద్రుపదుం డి ట్లనియె.