Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.7.253

Āndhra Mahābhāratamu 1.7.253

Language
Telugu

1.7.253

వ. మఱియుం దొల్లి గౌతమి యయిన జటిల యను ఋషికూఁతురు తపఃప్రభావంబున నేడ్వురు ఋషులకు నొక్కతియ భార్య యయ్యె ననియును, దాక్షాయణి యను మునికన్యక యేకనామంబునఁ బ్రచేతను లనంబరఁగిన పదుండ్రకు నొక్కతియ భార్యయయ్యె ననియును గథల వినంబడు; మఱి యట్లుం గాక.