Andhra Mahabharatamu 1.7.259
Āndhra Mahābhāratamu 1.7.259
- Language
- Telugu
1.7.259
వ. దానిదయిన పతిభక్తి గుణంబునకు మెచ్చి మౌద్గల్యుండు ప్రసన్నుం డయి ‘నీ కెద్ది యిష్టంబు వేఁడు మిచ్చెద’ ననిన నది యి ట్లనియె; ‘మునీంద్రా! నాకుం గామోపభోగేచ్ఛ పెద్ద గలదు; నీవునుం దపశ్శక్తిఁ గామరూప ధరుండ వయి యీ బీభత్సంబగు రూపం బుడిగి, మనోహరం బయిన రూపంబునం బంచధా విభక్తుండవయి నన్ను రమియించి కామభోగంబులం దనుపు’ మనిన దాని కిష్టంబైనవిధంబున నేను దేహంబులు దాల్చి మర్త్య దేవలోకంబులయందు బ్రహ్మర్షిదేవర్షిపూజితుం డై సూర్యరథం బెక్కి చని యాకాశగంగాజలంబుల నాప్లుతదేహుం డయి శీతాంశునంశు జాలంబుల వసియించి మేరుకైలాసంబులయందుఁ గ్రీడించుచు ననేకస్థానంబుల ననేక సహస్రవర్షంబులు నాలాయని యైన యింద్రసేన నుపభోగించి తృప్తుం డై, మౌద్గల్యుండు దాని విడిచి ఘోరతపంబు సేసి బ్రహ్మమయుం డై బ్రహ్మలోకంబునకుఁ జనిన; నది కామభోగములందుఁ దనియక కాలవశంబున శరీరము విడిచి కాశిరా జను రాజర్షికిం బుట్టి పెరుగుచుం గన్యాత్వమునఁ బెద్దకాలం బుండి తన దౌర్భాగ్యమునకు నిర్వేదించి, పతిం గోరి పశుపతి నుద్దేశించి యుగ్రతపంబు సేయుచున్నంత.