Andhra Mahabharatamu 1.7.261
Āndhra Mahābhāratamu 1.7.261
- Language
- Telugu
1.7.261
వ. అదియును గొండొకకాలంబు జలానిలాహార యై, కొండొకకాలంబు నిరాహార యై, కొండొకకాలం బేకపాదంబున నిల్చి, కొండొకకాలంబు పంచాగ్నిమధ్యంబున నుండి యత్యుగ్రతపంబు సేసిన నీశ్వరుండు ప్రసన్నుం డయి వరంబు వేఁడు మనిన, నక్కన్యక ‘నాకు బతిదానంబుఁ బ్రసాదింపు’ మని యర్థిత్వంబున నేనుమాఱులు వేఁడినం గరుణించి యీశ్వరుండు ‘నీకు దేహాంతరంబున నేవురుపతు లగుదు’ రనిన నది యి ట్లనియె.