Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.7.267

Āndhra Mahābhāratamu 1.7.267

Language
Telugu

1.7.267

వ. అట వైవస్వతుండును నైమిశార్యణంబున సత్త్రయాగదీక్షితుం డయి ప్రాణిహింస సేయకుండుటం చేసి మానవు లప్రాప్తమరణు లయి వర్తించుచున్న దాని సహింపనోపక యింద్రాదిదేవతలందఱు బ్రహ్మపాలికిం జని ‘భట్టారకా! మర్త్యు లమర్త్యు లయి వర్తిల్లువా రయిన వారికిని మాకును విశేషం బెద్ది?’ యని దుఃఖించిన నయ్యమరుల కమరజ్యేష్ఠుం డి ట్లనియె.