Andhra Mahabharatamu 1.7.277
Āndhra Mahābhāratamu 1.7.277
- Language
- Telugu
1.7.277
వ. ‘వారలు ధర్మానిలశక్రాశ్వినులు దమకు నాధారకర్తలుగా ధర్మజభీమార్జుననకులసహదేవు లనంగాఁ బుట్టిరి; కమలభవప్రముఖనిఖిలసురగణప్రార్థితుం డయి నారాయణుసితాసితకేశద్వయంబు బలదేవవాసుదేవు లై దేవహితార్థం బుద్భవించిన, నందు వాసుదేవుండు వారలకుఁ గార్యసహాయం డయ్యె; నయ్యింద్రుల కేవురకును నేకపత్నిగాఁ దపంబుసేసి శ్రీమూర్తి యయిన యాజ్ఞసేని యజ్ఞవేదిం బుట్టె; నమ్మవేని వీరల పూర్వదేహంబులఁ జూడు’ మని కృష్ణద్వైపాయనుండు ద్రుపదునకు దివ్యదృష్టి యిచ్చి చూపిన.