Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.7.279

Āndhra Mahābhāratamu 1.7.279

Language
Telugu

1.7.279

వ. మఱియు సకలలావణ్యమూర్తి యై వారల కేవురకుఁ బత్నిగాఁ దపంబు సేసిన యక్కన్యకపూర్వదేహంబును జూచి విస్మితుం డయి హర్షించి యున్న ద్రుపదునకు వెండియుం గృష్ణద్వైపాయనుం డి ట్లనియెఁ; ‘దొల్లి నితంతుం డను రాజర్షికొడుకు లనంతబలపరాక్రములు సాల్వేయ శూరసేన శ్రుతసేన బిందుసారాతిసారు లను వా రేవురుం బరస్పర స్నేహవినయంబుల నతిప్రసిద్ధు లయి పెరుఁగుచు నౌశీనరపతి కన్యక నజిత యను దాని స్వయం వరంబునఁ బడసి వివాహం బయి.