Andhra Mahabharatamu 1.7.283
Āndhra Mahābhāratamu 1.7.283
- Language
- Telugu
1.7.283
వ. అని నిశ్చయించి పంచినం బాంచాలపతియును గరం బనురాగంబునఁ బురం బష్టశోభనంబు సేయించి, సమారబ్ధవివాహమహోత్సవుం డయ్యె; నంత నిరంతర క్రముకకదళీస్తంభ శుంభత్సంభృత నవామ్రాశ్వత్థ పల్లవ మాలాలంకృత ద్వారతోరణంబులను, జందనోదక సంస్తిక ప్రాంగణ రంగవల్లీ కృత కర్పూరమౌక్తిక ప్రకరంబులను, గౌతుకోత్సవమంగళశృంగార వారాంగనా ప్రవర్త్యమాన స్వనియోగకృత్యంబులను, నుత్సవ సందర్శనాగతానేకరాజన్య సుహృద్బాంధవబ్రాహ్మణ సంకులంబుననుం జేసి యొప్పుచున్న ద్రుపదరాజ మందిరంబునం బూర్వోత్తర దిగ్భాగంబున విచిత్రనేత్ర వితత వితాన ముక్త మౌక్తిక కుసుమ మాలాలంబనాభిరామంబును, సమీచీన చీనాంశుక విరచితస్తంభ వేష్టనంబును, బ్రత్యగ్ర పల్లవ శాల్యక్షతాంచిత కాంచన పూర్ణ కలశోపశోభితంబును, లాజాజ్య సంపూర్ణ సౌవర్ణ పాత్ర నవసౌరభ బహువిధపుష్ప సమిత్కుశాశ్మశమ్యాభిరమ్యంబును, నవగోమయ శ్యామ మరకత మణి ప్రభాపటల విలిప్త హిరణ్మయవేదీమధ్యసమిద్ధాగ్నికుండమండితంబును, సర్వాలంకారసుందరంబును నయిన వివాహ మంటపంబునకుం జని నిజ పురోహితుం డయిన ధౌమ్యుం డాదిగా ననేకవిద్వన్మహీసుర నివహంబుతోఁ గరం బొప్పి.