Andhra Mahabharatamu 2.2.278
Āndhra Mahābhāratamu 2.2.278
- Language
- Telugu
2.2.278
వ. ‘ఇది యపూర్వంబైన పణంబు; దీని నొడ్డి యోటువడిన వార లజినవల్కలంబులు గట్టి వన్యమూలఫలాశనులై బ్రహ్మచర్యంబునం బండ్రెండేండ్లు వనవాసంబు సేసి, పదుమూఁడగు నేఁడు జనపదంబున నజ్ఞాతవాసంబు సేసి, యం దెఱుంగఁ బడిరేని వెండియుఁ బండ్రెండేండ్లు వనవాసంబు నొక్కయేఁ డజ్ఞాతవాసంబుఁ జేయుచుండు వా; రిట్లోపుదేని జూదం బాడుద’ మనిన ‘ననుద్యూతార్థం బాహూతుండనై మగుడ నగునే’ యని.