Andhra Mahabharatamu 2.2.317
Āndhra Mahābhāratamu 2.2.317
- Language
- Telugu
2.2.317
వ. మఱియు ద్రోణుండు పాండవులకు నెయ్యుం డయ్యును దొల్లి యాజోపయాజుల వరంబున నగ్ని కుండంబున నుద్భవిల్లిన ద్రుపదాత్మజుండు ధృష్టద్యుమ్నుండు పాండవసంబంధి యయి ప్రతివీరుం డగుట నాతనితోఁ దనకు సమరం బగు నని యెఱింగి పాండవానుగమనంబు సేయ నొల్లక గజపురంబున ధృతరాష్ట్రు నొద్దన యుండె; ని ట్లింద్రప్రస్థపురంబున నిరువది మూఁడేఁడులు రాజ్యంబు సేసి పాండవులు పాపద్యూత పరాజితు లయి.