Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 2.2.323

Āndhra Mahābhāratamu 2.2.323

Language
Telugu

2.2.323

గద్య. ఇది సకలసుకవిజనవినుత నన్నయభట్ట ప్రణీతం బయిన శ్రీమహాభారతంబునందు సభాపర్వంబున నర్ఘ్యాభిహరణంబును, శిశుపాల వధయును, రాజసూయ విభూతికి దుఃఖితుండై సభాస్ఖలితుండై యున్న దుర్యోధనుం జూచి ద్రౌపదీభీమసేనులు నగుటయు, రాజసూయవిభూతి సూచి సహింపక దుర్యోధనుండు జూదం బొనర్చుటయు, నందు శకుని కైతవంబున ధర్మరాజ పరాజయంబును, ద్యూతదుఃఖార్ణవ మగ్నులయిన పాండవులం బాంచాలి యుద్ధరించుటయుఁ, బునర్ద్యూత పరాజితులయి పాండవులు వనవాసగతు లగుటయు నన్నది సర్వంబును ద్వితీయాశ్వాసము.