Andhra Mahabharatamu 3.1.266
Āndhra Mahābhāratamu 3.1.266
- Language
- Telugu
3.1.266
వ. ఆబాలవృద్ధప్రసిద్ధుండవై పార్థివ సూర్యుండవైన నిన్నును, సింహసంహననులైన నీ తమ్ములను నెఱుఁగని వారు లేరు; మన గూఢభావంబు మేరువు నిగూఢభావంబునుంబోలె నఘటమానం; బిట్లేని నవ్వనవాసక్లేశం బెన్నఁడును మనకుఁబాయనేరదు; మన మిప్పు డివ్వనమునఁ బదుమూఁడు మాసంబులు సలిపితిమి; సంవత్సర ప్రతినిధిగా మాసంబులు సేసికొనుట యెందునుం గల యదియ; దీన ధర్మవిరోధంబు లేదు; విజయారంభంబున కిది యవసరం’ బనిన భీమసేను పలుకులు విని నిశ్వాస వ్యాకులిత ముఖుండై, పెద్దయుం బ్రొద్దు చింతించి ధర్మరా జిట్లనియె.