Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.1.276

Āndhra Mahābhāratamu 3.1.276

Language
Telugu

3.1.276

వ. అని ధర్మతనయు నేకాంతప్రదేశంబునకుం దోడ్కొని చని సత్యవతీసుతుండు విధిదృష్ట విధానంబునం బ్రతిస్మృతి యను విద్య నుపదేశించి. ‘దీని శక్తి నర్జునుం డధికతపోవీర్యవిభవుండై యింద్ర యమ వరుణ కుబేరాది దేవతలను నీశ్వరునిఁ బ్రత్యక్షంబు సేసికొని, వారలవలన దివ్యాస్త్రంబులు వడసి శత్రువుల జయించు; మఱి యివ్వనంబు భవచ్చిరనివాసంబునం జేసి విరళ ఫల కుసుమ పాదపంబై మృగకులోపరోధియై యొప్పకున్న యది; యొక్కచోటన పెద్దకాలం బునికి యెవ్వరికిం బ్రీతి జననంబు గాదు; కావున నొండువనంబున కరుగునది’ యని చెప్పి యమ్మునివరుం డరిగినఁ, దద్వాక్య ముదితులై ద్వైతవనంబు వాసి పాండవులు బ్రాహ్మణవరులతోన కామ్యకవనంబున కరిగి, సరస్వతీ తీరంబునందు నివాసంబుసేసి, కొండొకకాలం బుండ నొక్కనాఁ డజాతశత్రుం డర్జునుఁ జూచి యిట్లనియె.