Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.1.280

Āndhra Mahābhāratamu 3.1.280

Language
Telugu

3.1.280

వ. దివ్యాస్త్ర విదులైన వారల నోర్చునట్టి యుపాయంబు గృష్ణద్వైపాయనుండు ప్రసాదించె నీ విద్య నీవు ప్రతిగ్రహించి, కవచకార్ముక ప్రాస ఖడ్గ ధరుండవై యన్యుల కజేయుండవై యుత్తరదిక్కున కరిగి తపోయోగ బలంబున నింద్రుఁ బ్రత్యక్షంబు సేయుము; తొల్లి వృత్రునకు వెఱచి వేల్పులు తమ యాయుధంబులు బలంబులు నింద్రునందు సమర్పించి; రవి యెల్ల నీకుఁ దత్ప్రసాదంబున నగు; మఱి యింద్రునుపదేశంబున నీశ్వరు నారాధించి తదనుగ్రహంబున నిష్టసిద్ధి వడయు; మిది వేదవ్యాసు నుపదేశం’ బని.