Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.1.297

Āndhra Mahābhāratamu 3.1.297

Language
Telugu

3.1.297

వ. అందు మనోవాక్కాయ కర్మ నియతుండై పరమేశ్వరుం దనచిత్తంబున నిలిపి, నిరంతర త్రిరాత్రోపవాసంబుల నొక్క మాసంబుఁ జలిపి, ద్విగుణిత త్రిరాత్రోపవాసంబుల రెండవ మాసంబుఁ జలిపి, పక్షోపవాసంబుల మూఁడవ మాసంబు సలిపి, యూర్ధ్వబాహుండై యేకపాదాంగుష్ఠాగ్రంబున నిలిచి, వాయుభోజనంబు సేయుచు నాలవ మాసంబు సలిపి, యిట్లతిఘోరతపంబు సేయుచున్న యర్జునుం జూచి యందలి ఋషులు విస్మయం బంది యీశ్వరుపాలికిం జని యిట్లనిరి.