Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.1.327

Āndhra Mahābhāratamu 3.1.327

Language
Telugu

3.1.327

వ. అనిన యప్పార్థుం గరుణారస ప్రీతి విస్తారిత విలోకనామృతమ్మున సంతర్పితుం జేసి నగుచు నీశ్వరుండు వాని చేయి పట్టుకొని ‘ధనంజయా! నీ చేసిన వ్యతిక్రమంబు క్షమియించితి; నతిమానుషంబైన నీ పరాక్రమంబునకు మెచ్చితిఁ; బూర్వజన్మంబున నీవు నరుండను దేవర్షివి; నారాయణ సఖుండవు; నరనారాయణు లనంగా మీరిద్దఱు బదరీవనంబున ననేకాయుతవర్షంబులు తపంబుఁ జేసిన మహావీర్యవంతులరు; మీ తేజంబున జగంబులు రక్షితంబు లగుచున్నయవి; యిగ్గాండీవమ్ము దొల్లియు నీయదియ; దీనన చేసి శక్రాభిషేకమ్మునాఁ డసురుల జయించి; తది యిప్పు డక్షయశరధులతోడి మదీయమాయాగ్రస్తంబయ్యె నీగాండీవమ్మును నక్షయశరధులు నీ కిచ్చితిం గొను; మింక నీకిష్టంబైన వరమ్ము వేఁడు మిచ్చెద’ ననిన నర్జునుం డిట్లనియె.