Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.1.329

Āndhra Mahābhāratamu 3.1.329

Language
Telugu

3.1.329

వ. ఇదియును బ్రహ్మ శిరంబను నస్త్రంబును యుగాంతకాలంబునందుఁ బ్రయుక్తమ్ములై జగత్సంహారమ్ము సేయు; దీనివలన నభిమంత్రితమ్ములై యనేక శత సహస్ర సంఖ్యల శూలంబులు గదలు నాశీవిషంబుల యట్టి యమ్ములు నుద్భవిల్లునని విందు; నీ కారుణ్యంబున దీనిం బడసి దైత్య దానవ యక్షరాక్షస పిశాచోరగమ్ముల జయింతు; నతివీరులైన భీష్మ ద్రోణాదులను జయింతు; సహజకుండలుండైన కర్ణుని వధియింతు’ ననిన నీశ్వరుండుఁ గరుణించి విశుద్ధాత్ముండైన పార్థునకు మంత్రధ్యాన జపహోమ పూర్వకంబుగా సంధాన మోక్షణ సంహార సహితంబుగాఁ బాశుపతాస్త్రం బిచ్చి ‘దీనికి నసాధ్యం బెద్దియును లే, దల్పులయందుఁబ్రయుక్తంబైన జగత్సంహారము సేయు.