Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.1.349

Āndhra Mahābhāratamu 3.1.349

Language
Telugu

3.1.349

వ. మఱియు ననాహితాగ్నులకు, నతీర్థసేవకులకు, ననృతవాదులకు, వేద విరుద్ధాచారులకు, మాంసాహారులకు, రణపరాఙ్ముఖులకుఁ జొర నవిషయంబును, నతి గహ్వరంబును నైనదాని నమరావతిఁ జొచ్చి, తద్గోపుర సమీపంబున ననవరత గండస్థల గళదవిరళమదజలకుల్యాభిరామంబై నిరంతర నిర్ఝరనీహార నగంబునుం బోలె నొప్పుచున్న యైరావతంబుఁ జూచుచు. సురసిద్ధ సాధ్య గణంబుతో విద్యాధరాప్సరో గంధర్వ కిన్నర జేగీయమానుం డగుచు చను నప్పుడు.