Andhra Mahabharatamu 3.1.358
Āndhra Mahābhāratamu 3.1.358
- Language
- Telugu
3.1.358
వ. అంత సూర్యాస్తమయ సమయంబునఁ జంద్రుం డుదయించి సాంద్రచంద్రికావిలాసంబున దిగ్వనితల నలంకరించుచుండ, నిలింపపతి పంపున సొంపార నూర్వశి యర్జునసంగమకాంక్షంజేసి చంద్రికాధవళ దుకూలంబు గట్టి, మృగమద కర్పూర కుంకుమోన్మిశ్రిత సుగంధం బలఁది, వివిధ సురభి కుసుమ విసరంబులు ముడిచి, మణిమయ భూషణాలంకృతయై నిలుకడ వడసిన క్రొమ్మెఱుంగుఁ దీఁగయుంబోలె, మణిమయ మంజీర ఝళం ఝళ నినాదంబును, గంకణ, ఝణ ఝణత్కారంబును, గటికలాప కింకిణీ క్రేంకారంబును, మదనాజ్ఞా వాద్యఘోషంబునుంబోలె మ్రోయుచుండ, మందగమనంబునఁ బురందరనందను మందిరంబున కరుగుదెంచిన, నప్పురుషసత్తముండు భయభక్తిసంభ్రమంబులతోఁ బ్రత్యుత్థానంబును దండ ప్రణామంబునుం జేసి, కరకమలంబులు మొగిచి యిట్లనియె.