Andhra Mahabharatamu 3.1.363
Āndhra Mahābhāratamu 3.1.363
- Language
- Telugu
3.1.363
వ. ఈ లోకంబున వనితలుఁ బురుషులు విచ్చలవిడిఁ గ్రీడింతు; రిచ్చటి కిది యనిందితంబైన యాచారంబు; నీవును ద్రిదివంబునకు వచ్చిన యప్పుడ దివ్యపురుషుండవు గావున నా మనోరథంబు సఫలంబుగా మందార మంజుల మంజరీ మకరంద పాన మత్తు మధుకర గాన మనోహర స్థలంబులను, మేరు శైల కందరంబులను, మంద పవనంబులు గల నందనాది వనంబులయందును, నితాంత కాంత వికసిత కనకారవింద సమధిక సౌరభ సంవాసిత మహానంద కందంబులైన మందాకినీ తీర మణిమయ వేదికలయందును, జంద్రికాసుందరంబులైన సికతాతలంబులను, మఱియు నిర్జర విహార స్థానంబుల ననవరత సురత కేళీ సౌఖ్యాంబుధి నన్ను నోలలార్పు’ మనిన, నిర్వికార ధైర్యధుర్యుండై యర్జునుం డిట్లనియె.