Andhra Mahabharatamu 3.1.365
Āndhra Mahābhāratamu 3.1.365
- Language
- Telugu
3.1.365
వ. జగంబులు పుట్టింపను మనుపను సమయింపను గర్తలైన దేవతలకు నెట్లు నడచిన నెగ్గు లేదు; నేను గర్మభూమిని జనియించితి; సత్కర్మపరుండ నైన నాకు నిచ్చటి యాచారం బుచితంబు గాదు; మదీయ వంశకర్త యైన పురూరవునకుఁ బత్నివైన కారణంబునను, బురందరునకుఁ బరిచర్య యొనర్చుటం జేసియు నాకు జనని వగుట సందియంబు లేదు; తల్లీ! నన్నుం బుత్త్రవాత్సల్యంబునం జూడు’ మనిన మదనబాణపీడితయై కోపారుణిత నయనంబుల నర్జునుం జూచి యూర్వశి ‘యేను గామించి వచ్చిన నా మనోరథంబు విఫలంబుఁ జేసిన వాఁడవు; నీవు మర్త్యలోకంబున మానవర్జితుండవై మానినీమధ్యంబున నపుంసకుండవై యుండు’ మని శాపం బిచ్చి నిజగృహంబునకుఁ జనియె; నంతఁ బ్రభాత సమయంబునఁ దద్వృత్తాంతం బంతయు విని సురపతి కొడుకున కిట్లనియె.