Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.1.377

Āndhra Mahābhāratamu 3.1.377

Language
Telugu

3.1.377

వ. అని తత్ప్రభావంబు సెప్పి యింద్రుండు రోమశున కిట్లనియె ‘మునీంద్రా! నీవు మర్త్యలోకంబునకుం బోయి ధర్మజుం గని యతనికిం దత్సహోదరులకు సంతోషంబుగా నా యొద్దం బార్థుండున్న కుశలవార్త యెఱింగించి, భీష్మ ద్రోణ కర్ణాది వీరుల నోర్చునట్టి దివ్యాస్త్రంబులు వడసె, నతండు మీ యొద్దకు వేగంబ వచ్చు, వగవకుండుం డని చెప్పి నా వచనంబున ధర్మజు నఖిలతీర్థసేవ సేయం బంపు; మట్లయిన నపేతదురితుండై యఖిల మహీరాజ్యంబు వడయు; నతండు తీర్థాభిగమనంబు సేయునపుడు నీ వాతనికి సహాయుండవు గ’మ్మని యింద్రుండు రోమశుం బనిచె; నిట ధృతరాష్ట్రుం డర్జును దివ్యాస్త్రలాభంబుఁ బారాశర్యువలన నెఱింగి పరమవ్యాకులహృదయుండై సంజయున కిట్లనియె.