Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.1.384

Āndhra Mahābhāratamu 3.1.384

Language
Telugu

3.1.384

వ. నీయుపేక్షం జేసి దుర్యోధనుచేత దుర్ద్యూత పరాజితులై రాజ్యంబు విడిచి పాండవు లరిగి కామ్యకవనంబున నున్నఁ, గృష్ణుం డనేకరాజసమన్వితుండై వారి యొద్దకు వచ్చి నీ కొడుకులు సేసిన నికారంబునకుం గృష్ణాపరిభవంబునకు దుఃఖితుండై కడు నలిగి, మీకు నెగ్గు సేసిన దుర్యోధనాదుల దూషించి గజపురంబున ధర్మరాజు రాజ్యాభిషిక్తుం జేయుదు ననియు, రాజసూయంబు సేయు నాఁడింద్రప్రస్థంబుననైన విభూతికంటె విశేషవిభూతి గావింతు ననియు, ద్రుపద సృంజయ కేకయ ధృష్టద్యుమ్న బలదేవ సాంబ సాత్యకి ప్రభృతుల సమక్షంబునం బలికి, సత్యసమయులైన పాండవులచేత సంరంభ నివారితుండై, పార్థుసారథ్యంబునకుఁ బ్రార్థితుం డయ్యె నని వింటిమి.