Andhra Mahabharatamu 3.1.395
Āndhra Mahābhāratamu 3.1.395
- Language
- Telugu
3.1.395
వ. సత్యభంగభీతుండవు గావున నీ వింద యుండి పదుమూఁడేండ్లుం జలిపి పదంపడి కరిపురంబునకు వచ్చి రాజ్యాభిషిక్తుండ వగుము; దుష్టద్యూతంబున మనరాజ్యం బపహరించిన సుయోధనుండు సుచిర ప్రతిష్ఠితుండు గాకుండ నిప్పుడ యద్దురాత్ము దూషింతుము; నికృతిపరుల నికృతిన చేసి నిర్జించినఁ బాపంబు లేదు; సర్వ ప్రకారంబులను శత్రువుల జయించి రాజ్యంబు సేకొనుట రాజులకు విధిచోదితంబైన రాజధర్మంబ’ యనిన భీమసేను మహాసంరంభంబునకు సంతోషించి ధర్మనందనుండాతనిం దనపైకిం దిగిచికొని మూర్ధాఘ్రాణంబు సేసి యిట్లనియె.