Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.4.267

Āndhra Mahābhāratamu 3.4.267

Language
Telugu

3.4.267

మత్తకోకిల. అంబుజాసనుఁ డింద్రుఁ డీశ్వరుఁ డంతకుండు ధనేశ్వరుం
డంబుధీశుఁడు లోనుగా సుర లస్మదాకృతు; లుర్వి పా
దంబు, లగ్ని ముఖంబు, సూర్యసుధాకరుల్‌ నయనంబు, లీ
యంబరంబు శిరంబుగా నిటు లద్భుతాకృతి నుండుదున్‌.